శనివారం 04 జూలై 2020
Sports - May 19, 2020 , 20:27:18

చెన్నై కింగ్ కాదు స్వీట్ కింగ్‌

చెన్నై కింగ్ కాదు స్వీట్ కింగ్‌

చెన్నై: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో క్రికెట‌ర్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మిగిలిన‌వారి సంగ‌తెలా ఉన్నా.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ అభిమానుల‌కు మాత్రం ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. గ‌తేడాది ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ అనంత‌రం ధోనీ మైదానంలోకి దిగింది లేదు. తొలుత దేశ ర‌క్ష‌ణ కోసం రెండు నెల‌ల విరామం అని చెప్పిన మ‌హీ ఆ త‌ర్వాత కూడా జ‌ట్టులోకి రాలేదు. దీంతో ఐపీఎల్లోనైని క‌నువిందు చేస్తాడ‌నుకుంటే కొవిడ్‌-19 కార‌ణంగా ఆ అవ‌కాశం కూడా లేకుండా పోయింది. 

ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ సార‌థికి సంబంధించిన ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానుల‌ను సంతృప్తి ప‌ర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సీఎస్‌కే అధికారిక ట్విట్ట‌ర్‌లో ధోనీ హోట‌ల్ రూమ్ నుంచి టీమ్ బ‌స్సులోకి వెళ్తున్న వీడియోను పోస్ట్ చేసింది. `స్వీట్ కింగ్ ఇక్క‌డా.. సింప్లీ రాక్ ఆన్‌` అని వ్యాఖ్య జోడించింది. ఇందులో మ‌హీ వెన‌కాల సురేశ్ రైనా కూడా ఉన్నాడు. త‌లుపు తీసుకొని బయ‌ట‌కు వ‌చ్చిన మ‌హీ చేతిలో ఉన్న ద్రాక్ష‌పండ్ల గుత్తిని అభిమానుల వైపు చూపిస్తూ.. బ‌స్సు ఎక్కుతున్న ఈ వీడియోకు తెగ లైకులు వ‌స్తున్నాయి.  


logo