గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 17, 2020 , 00:24:47

నేటి నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ

 నేటి నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ

ఇల్లెందు, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మహిళల, పురుషుల జట్లు పాల్గొననున్న కబడ్డీ టోర్నమెంట్‌ సోమవారం ప్రారంభం కానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని సింగరేణి స్టేడియంలో నిర్వహించనున్న ఈ టోర్నీ కోసం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. పోటీలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించనుండగా.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు, మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత, ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్‌, జిల్లా కబడ్డీ అసోషియేషన్‌ అధ్యక్షుడు బానోతు హరిసింగ్‌నాయక్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోటీల్లో పాల్గొనే 1100 మంది క్రీడాకారుల కోసం నిర్వాహకులు వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.


logo
>>>>>>