శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 08, 2020 , 02:40:28

హోరాహోరీగా బాక్సింగ్‌ పోటీలు

హోరాహోరీగా బాక్సింగ్‌ పోటీలు

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: క్రీడా టోర్నీల పునరుద్ధరణ మొదలైంది. శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా క్లబ్‌ ఫైట్స్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు  వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, టోర్నీ నిర్వాహకుడు కైలాశ్‌నాథ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో త్రిజోత్‌సింగ్‌పై విజయ్‌ కుమార్‌, అభినయ్‌పై సురేశ్‌, అరవింద్‌పై నితిన్‌ రాజ్‌, కేశవ్‌పై జ్ఞానేశ్వర్‌, రాజుపై మైఖేల్‌ గెలిచారు.