గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 26, 2020 , 00:02:12

సర్వ హంగులతో పీహెచ్‌ఎల్‌

 సర్వ హంగులతో పీహెచ్‌ఎల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌(పీహెచ్‌ఎల్‌) అన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తొలిసారి లీగ్‌ రూపంలో రాబోతున్న పీహెచ్‌ఎల్‌లో ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇందులో తెలంగాణ టైగర్స్‌, ధాకడ్‌ ఢిల్లీ, బెంగాల్‌ బ్లూస్‌, రాజస్థాన్‌ రెడ్‌హాక్స్‌, యూపీ ఐకాన్స్‌, తమిళ్‌ వీరన్స్‌ జట్లు ఉన్నాయి. కాన్పూర్‌ వేదికగా జరిగిన వేలంపాటలో ఒక్కో ఫ్రాంచైజీ 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వీరితో పాటు ఒక కోచ్‌, ఇద్దరు సహాయక సిబ్బందిని తీసుకున్నాయి. జైపూర్‌ వేదికగా వచ్చే నెల 5న లీగ్‌ మొదలుకానుంది. ఈ సందర్భంగా పీహెచ్‌ఎల్‌ చైర్మన్‌ జగన్‌మోహన్‌ రావు మాట్లాడుతూ లీగ్‌ ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కృషి చేశారన్నారు. 
logo
>>>>>>