శుక్రవారం 03 జూలై 2020
Sports - May 21, 2020 , 21:40:07

పాండ్యా జెర్సీ నంబ‌ర్ క‌థ తెలుసా..!

పాండ్యా జెర్సీ నంబ‌ర్ క‌థ తెలుసా..!

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌడ‌ర్ హార్దిక్ పాండ్యా జెర్సీ నంబ‌ర్‌కు సంబంధించి అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టింది. కెరీర్ తొలినాళ్ల‌లో పాండ్యా ధ‌రించిన 228 నంబ‌ర్ జెర్సీని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఐసీసీ.. `ఈ నంబ‌ర్ వెనుక ఉన్న క‌థ ఎవ‌రికైనా తెలుసా?  కాస్త చెప్ప‌గ‌ల‌రా` అని వ్యాఖ్యానించింది. దీంతో వైర‌ల్‌గా మారిన ఈ పోస్టుకు వేల‌కొద్ది రిప్లేలు వ‌స్తున్నాయి. 

అస‌లు విష‌యం ఏంటంటే 228 అనేది హార్దిక్ పాండ్యాలో అత‌డు చేసిన అత్య‌ధిక స్కోరు. అదీ అండ‌ర్‌-16 స్థాయిలో. 2009 విజ‌య్ మ‌ర్చంట్ ట్రోఫీలో బ‌రోడా త‌ర‌ఫున బ‌రిలో దిగిన పాండ్యా ముంబైతో మ్యాచ్‌లో 391 బంతుల్లో 228 ప‌రుగులు చేశాడు. 8 గంట‌ల‌కు పైగా సుదీర్ఘంగా క్రీజులో నిలిచిన పాండ్యా త‌న‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడ‌గ‌ల స‌త్తా ఉంద‌ని అప్పుడే చాటిచెప్పాడు. 60/4 తో క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును త‌న అస‌మాన బ్యాటింగ్‌తో గ‌ట్టెక్కించాడు. అంతేకాక ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లోనూ విజృంభించి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌ర్వాత నిల‌క‌డ‌గా రాణించిన పాండ్యా ఎట్ట‌కేల‌కు భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో పాండ్యా 228 నంబ‌ర్ గ‌ల జెర్సీతో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆ త‌ర్వాత 33వ నంబ‌ర్‌ను ఎంచుకున్నాడు. గ‌తంలో ఈ అంశంపై స్పందించిన పాండ్యా కోచ్ `ఆ ఇన్నింగ్స్‌తోనే పాండ్యా ప్ర‌తిభ ప్ర‌పంచానికి తెలిసింది` అని చెప్పాడు.


logo