బుధవారం 08 జూలై 2020
Sports - Jun 20, 2020 , 13:00:39

హోటల్‌ మొత్తం అభిమానులతో నిండిపోయింది : రోహిత్‌

హోటల్‌ మొత్తం అభిమానులతో నిండిపోయింది : రోహిత్‌

ముంబై : కరోనా కారణంగా నిలిచిపోయిన టోర్నీలు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. స్టేడియంలో అభిమానులు లేకుంటే మజానే ఉండదని అంటున్నాడు రోహిత్‌శర్మ. స్టార్‌ స్పోర్ట్స్‌లో ఓ కార్యక్రమంలో రోహిత్‌ మాట్లాడుతూ అభిమానుల మద్దతు క్రికెట్‌కు ఎంత బలమో ఒక ఉదాహరణ చెప్పాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో ఆస్ర్టేలియాను ఓడించిన తర్వాత టీం సభ్యులు ఉండే హోట‌‌ల్‌కు అభిమానులు పోటెత్తారని, ఆ సమయంలో వారి ఆనందానికి హద్దులు లేవని గుర్తుచేశాడు.

‘అప్పటి జ్ఞాపకాలు నేను మర్చిపోలేను, మా టీం సభ్యలంతా బస చేసే హోట‌ల్‌ మొత్తం అభిమానులతో నిండిపోయింది. వారంతా విజయం సాధించిన ఆనందంతో చిందులేశారు. ఆ క్షణాలు నా కళ్లను నేనే నమ్మలేక పోయాను. నాకు అప్పుడు తెలిసింది అభిమానుల ప్రోత్సాహమే జట్టును గెలిపిస్తుందని’ అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు రోహిత్‌.


logo