మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 19:02:25

అర్థరాత్రి ప్రేమికుడిని కలవడానికి వెళ్లిన కూతురు.. గొడ్డలితో నరికి చంపిన తండ్రి

అర్థరాత్రి ప్రేమికుడిని కలవడానికి వెళ్లిన కూతురు.. గొడ్డలితో నరికి చంపిన తండ్రి

కాన్పూర్‌ : ప్రేమికుడిని కలవడానికి వెళ్లిందని కన్నకూతురిని కడతేర్చాడో తండ్రి. ఈ పరువు హత్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో జరగ్గా స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కాన్పూర్‌ రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఎదురింటి యువకుడితో ఏడిదిన్నరగా ప్రేమ వ్యవహారం నడుపుతుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి బాలిక తన తండ్రి పడుకున్న సమయం చూసి ఎదురింట్లో ఉన్న తన ప్రియుడిని కలువడానికి వెళ్లింది. ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో గొడ్డలి తీసుకొని బాలుడి ఇంటికి వెళ్లి ఇద్దరినీ నరికి పారిపోయాడు.

ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మరణించగా.. ప్రియుడు తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ దినేశ్‌ చంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరీస్థితిని సమీక్షించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo