శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 23, 2020 , 01:56:00

సిడ్నీలోనే తొలి వన్డే

సిడ్నీలోనే తొలి వన్డే

సిడ్నీ: ఆటగాళ్లు ప్రాక్టీస్‌తో కూడిన క్వారంటైన్‌లో ఉండేందుకు న్యూ సౌత్‌వేల్స్‌ ప్రభుత్వం అంగీకారం తెలుపడంతో ఆస్ట్రేలియా తో టీమ్‌ఇండియా పోరు సిడ్నీ వేదికగానే ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ నుంచి తిరిగివచ్చే ఇరు జట్ల ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్‌ చేసేలా క్రికెట్‌ ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్‌ ప్రభుత్వం గురువారం ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఆసీస్‌లో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు సిడ్నీ, కాన్‌బెర్రాలో జరుగడం దాదాపు ఖాయమైంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో కోహ్లీసేన మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబర్‌ 27న సిడ్నీలో తొలి వన్డేతో పోరు ప్రారంభం కానుండగా.. 29న రెండో వన్డే అక్కడే జరుగనుంది. మూడో మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న కాన్‌బెర్రాలోనే తొలి టీ20 జరుగనుంది. చివరి రెండు టీ20లు మళ్లీ సిడ్నీలో జరుగనున్నాయి.