మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 29, 2020 , 00:36:19

డీఆర్‌ఎస్‌ను సమీక్షించాలి

డీఆర్‌ఎస్‌ను సమీక్షించాలి

ముంబై: డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ (డీఆర్‌ఎస్‌)లోని ‘అంపైర్స్‌ కాల్‌'నిబంధనను అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) పునః పరిశీలించాలని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కోరాడు. అందులో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో సంతృప్తి చెందని ఆటగాళ్లు సమీక్షకు వెళ్తే.. టీవీ అంపైర్‌ తిరిగి అంపైర్‌ కాల్‌గా ప్రకటించడం వారికి అన్యాయం చేయడమేనని సచిన్‌ సోమవారం ట్వీట్‌ చేశాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అంపైర్‌ కాల్‌ నిర్ణయాలు ఆసీస్‌ జట్టుకు అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో సచిన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.


logo