మంగళవారం 20 అక్టోబర్ 2020
Sports - Oct 02, 2020 , 02:02:12

ఐపీఎల్‌ 13వ సీజన్ 26.9కోట్ల మంది వీక్షించారు

ఐపీఎల్‌ 13వ సీజన్ 26.9కోట్ల మంది వీక్షించారు

ముంబై: కరోనా వైరస్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత యూఏఈలో జరుగుతున్న ఈ ఏడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ ఏడాది లీగ్‌ను తొలి వారం టీవీల్లో 26.9కోట్ల మంది వీక్షించారని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) గురువారం నివేదిక వెల్లడించింది. వ్యూవర్‌షిప్‌తో పాటు గతేడాది కంటే ఈ సారి 15శాతం ప్రకటనల్లోనూ లీగ్‌ వృద్ధి సాధించిందని తెలిపింది. అలాగే 60.6 బిలియన్‌ వీక్షణ నిమిషాలు నమోదు కాగా.. గతేడాది కంటే ఇది 15శాతం ఎక్కువని వెల్లడించింది. టీవీలు ఉన్న 44శాతం మంది మ్యాచ్‌లను చూస్తున్నారని బార్క్‌ చెప్పింది. అలాగే గతేడాది లీగ్‌తో పోలిస్తే ఈ సారి ఐపీఎల్‌ తొలి వారం మ్యాచ్‌లకు 30శాతం అధికంగా వీక్షణలు వచ్చాయని  బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ ఇండియా ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లో చేస్తున్న ప్రత్యక్ష ప్రసార వీక్షణల్లోనూ 39.4శాతం వృద్ధి ఉందని తెలిపింది.  


logo