మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 25, 2021 , 00:54:27

అది సమ్‌థింగ్‌ స్పెషల్‌

అది సమ్‌థింగ్‌ స్పెషల్‌

మెల్‌బోర్న్‌ శతకంపై అజింక్యా రహానే

న్యూఢిల్లీ: కష్టకాలంలో వచ్చిన మెల్‌బోర్న్‌ శతకం చాలా ప్రత్యేకమైనదని భారత స్టార్‌  బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానే పేర్కొన్నాడు. అడిలైడ్‌లో అవమానకర ఓటమి అనంతరం బాక్సింగ్‌ డే టెస్టులో సెంచరీ చేయడం సంతృప్తికరంగా అనిపించిందని  అన్నాడు. ‘వ్యక్తిగత మైలురాళ్ల కన్నా జట్టు విజయమే ప్రధానమని బలంగా నమ్ముతా. టీమ్‌ గెలుపులో నా పాత్ర ఉంటే అంతకుమించిన సంతో షం మరొకటి ఉండదు. అయితే మెల్‌బోర్న్‌ సెంచరీ మాత్రం ప్రత్యేకమని చెప్పక తప్పదు. నా కెరీర్‌లో అత్యుత్తమమని భావించే లార్డ్స్‌ శతకం కన్నా.. మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌ గొప్పతనం ఎక్కువ అని చాలా మంది అంటున్నారు. మెల్‌బోర్న్‌లో సత్తాచాటడంతోనే సిరీస్‌లో తిరిగి పుంజుకోగలిగాం’ అని రహానే అన్నాడు. 

VIDEOS

logo