బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 02, 2020 , 01:29:47

అందుకే రోహిత్‌ను ఎంపిక చేయలేదు: శాస్త్రి

 అందుకే రోహిత్‌ను ఎంపిక చేయలేదు: శాస్త్రి

దుబాయ్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గాయం బారిన పడే ప్రమాదం ఉన్నట్లు వైద్య నివేదకల్లో వెల్లడైందని జట్టు హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించాడు. అందుకే పూర్తిగా కోలుకునే వరకు అతడు  ఆడకుంటేనే మంచిదని సూచించాడు. వైద్యులు ఇచ్చిన రిపోర్టు మేరకే సెలెక్టర్లు రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని శాస్త్రి స్పష్టం చేశాడు. కండరాల నొప్పి కారణంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ ఐపీఎల్‌లో గత నాలుగు మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. రవిశాస్త్రి ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లా డుతూ.. ‘ఓ ప్లేయర్‌గా ఎక్కువ కాలం ఆటకు దూరం గా ఉండడం చిరాకైన పనే. అయితే గాయం నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు విశ్రాంతి తీసుకోకతప్పదు. అయితే ఇషాంత్‌ శర్మ అంత తీవ్రమైన పరిస్థితి రోహిత్‌కు లేదు’అని రవిశాస్త్రి అన్నా డు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ చేరుకోవడంపై రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్‌ కూడా ఓ చిన్నపాటి టోర్నమెంటేనని అన్నాడు.