శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 16:59:34

ఈసారి కోహ్లీ లక్ష్యం అదే : గంభీర్‌

ఈసారి కోహ్లీ లక్ష్యం అదే : గంభీర్‌

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనేక ప్రశంసలు పొందాడు. 2018, 2019లో ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ సాధించేందుకు గాను భారత్‌ను ముందుండి నడిపించాడు. కెప్టెన్‌గా కోహ్లీ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన విజయాలను నమోదు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్తేజకరమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం బెంగళూరు జట్టును నడిపించడంలో డక్కీముక్కీలు తింటున్నాడు. ఇప్పటివరకు ఒక్కసారి కోడా కోహ్లి నాయకత్వంలోని ఆర్‌సీబీ కప్పు గెలవలేదు. 

ఈ ఏడాది టోర్నమెంట్‌ను యూఏఈలో నిర్వహిస్తున్నందున ఆ దేశంలో పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయని, ఆర్‌సీబీ ఆటగాళ్లకు అనుకూలిస్తాయని, యూఏఈలో ఆర్‌సీబీ టైటిల్‌ గెలిచే అవకాశం ఉందని క్రికెట్‌ పండితులు భావిస్తున్నారు.

ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్‌, మాజీ కేకేఆర్‌ కెప్టెన్‌ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ "2016 నుంచి ఆర్‌సీబీకి విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు కప్పు గెలువలేకపోయాడు. జట్టు సమతుల్యత గురించి విరాట్‌ ఆలోచన చేసినట్లు అనిపిస్తుంది. అతడు ఎలాగైనా ఈసారి ట్రోఫీ సాధించాలి. విరాట్‌ వ్యక్తిగత ప్రదర్శన బాగున్నప్పటికీ ట్రోపీ సాధించలేకపోతున్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలబెట్టడమే అతడి ముందున్న లక్ష్యం. టోర్నీలో మంచి ప్రదర్శన చేయాలని ఉంటుందా.. లేక కప్పు గెలవాలని ఉంటుందా.. అన్న ప్రశ్నకు ఎవరైనా కప్పు గెలవాలనే కోరుకుంటారు. ఓపెనర్‌గా బరిలోకి దిగే విరాట్‌కు ఎక్కువ పరుగులు సాధించే అవకాశం ఉంది. కాబట్టి విరాట్‌ ఇప్పుడు జట్టును విజేతగా నిలబెట్టాలి. లేకపోతే ప్లేఆఫ్‌కు అయినా తీసుకెళ్లాలి." అని గంభీర్‌ అన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo