గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 20:24:57

ఆరోజు ధోని ఏడ్చేశాడు : అశ్విన్‌

ఆరోజు ధోని ఏడ్చేశాడు : అశ్విన్‌

ధోని రిటైర్మెంట్‌ సందర్భంగా రవిచంద్రన్‌ అశ్విన్ 2014 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను గుర్తు చేసుకున్నాడు. అశ్విన్‌ ఓ విడియోలో మాట్లాడుతూ ‘2014లో ధోని టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ కావాలని నిర్ణయాన్ని ప్రకటించాడు. సిరీస్‌ మొదటి టెస్ట్ నుంచి ధోని గాయం కారణంగా రెస్టు తీసుకుంటున్నాడు. తొలి టెస్టులో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. తరువాత 3వ టెస్టు మెల్బోర్న్‌లో జరిగినప్పుడు ధోని జట్టులోకి వచ్చాడు.  ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ అది. ఆ సమయంలో నేను ధోని గ్రీజులో ఉండి ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఓడిపోయాం’అని అశ్విన్‌ చెప్పాడు.


మెల్బోర్న్ టెస్ట్ తర్వాత ధోని రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడని అశ్విన్‌ తెలిపాడు. ‘2014లో టెస్ట్ క్రికెట్ నుంచి ధోని రిటైర్‌ అయినప్పుడు నాకు గుర్తుంది. మెల్బోర్న్‌ టెస్టు ఓడిపోయిన తరువాత ఆరోజు రాత్రి ఇషాంత్‌ శర్మ, సురేశ్‌ రైనా, నేను ఓ గదిలో కూర్చున్నాం. అప్పటికీ ఇంకా ధోని తన జెర్సీని విప్పలేదు. అప్పుడు మా అందరి ముందు ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడ’ని అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. 

2014లో నాల్గవ టెస్టుకు ముందే ధోని టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతడి స్థానంలో కోహ్లిని కెప్టెన్‌ చేశారు. ధోని 90 టెస్టులు ఆడి 38.09 సగటుతో 4.876 పరుగులు చేశాడు. టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ధోని 350 వన్డేలు ఆడాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo