గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 29, 2020 , 02:16:26

ఆ బంతి వదిలేసినందుకు థ్యాంక్స్‌: యువీ

ఆ బంతి వదిలేసినందుకు థ్యాంక్స్‌: యువీ

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాటియాకు టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సరదాగా ధన్యవాదాలు చెప్పాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు సిక్సర్లు బాదిన తెవాటియా ఐదో బంతిని వదిలేసి.. మళ్లీ చివరి బాల్‌కు ఆరు పరుగులు సాధించడంతో రాజస్థాన్‌ 224 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించగలిగింది. దీంతో టీ20ల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్‌ సింగ్‌ రికార్డు పదిలంగా ఉంది. ఈ విషయంపైనే యువీ ట్విట్టర్‌లో తెవాటియాను భాయ్‌ అంటూ సరదాగా స్పందించాడు. ‘మిస్టర్‌ రాహుల్‌ తెవాటియా ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్స్‌. అద్భుతమైన మ్యాచ్‌. గొప్ప విజయం సాధించినందుకు రాయల్స్‌కు అభినందనలు. శాంసన్‌, మయాంక్‌ కూడా అద్భుతంగా ఆడారు’  అని యువీ ట్వీట్‌ చేశాడు. మరోవైపు తెవాటియా ఆటతీరుపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహింద్రా, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, పీటర్సన్‌ ప్రశంసలు కురిపించారు. 


logo