బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 18:41:36

శ్రీకాంత్‌ బోణీ..31 నిమిషాల్లోనే!

శ్రీకాంత్‌ బోణీ..31 నిమిషాల్లోనే!

బ్యాంకాక్‌: భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నమెంట్‌లో బోణీ కొట్టాడు.  పురుషుల సింగిల్స్‌  రెండో రౌండ్‌లోకి శ్రీకాంత్‌  ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన సౌరభ్‌ వర్మపై 21-12 21-11తో శ్రీకాంత్‌ విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరు కేవలం 31 నిమిషాల్లోనే ముగిసింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కిదాంబి వరుస సెట్లను కైవసం చేసుకున్నాడు. మరో  బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 


logo