Sports
- May 04, 2020 , 01:48:47
VIDEOS
ప్రమాదకరమైన వికెట్‌పై టెస్టు మ్యాచ్‌లా..

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఏర్పడిన పరిస్థితులను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. ప్రమాద కరమైన పిచ్‌పై టెస్టు మ్యాచ్ ఆడినట్లు ఉందని దాదా అన్నాడు. ఆదివారం ఓ ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ ‘కొవిడ్-19 కారణంగా ప్రస్తుత పరిస్థితి.. ప్రమాదకర వికెట్‌పై టెస్టు మ్యాచ్ ఆడుతున్నట్లు ఉంది. బంతి స్వింగ్‌తో పాటు స్పిన్ కూడా అవుతున్నది. బ్యాట్స్‌మెన్ ఔట్ కాకుండా ఉండేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే స్కోరు సాధించడంతో పాటు వికెట్ కాపాడుకుంటూ టెస్టు మ్యాచ్ గెలువాలి. ఇది ఓ రకంగా చాలా కష్టమైనా.. మనమందరం ఈ మ్యాచ్ గెలుస్తామన్న నమ్మకం నాకుంది’ అని గంగూలీ అన్నాడు.
తాజావార్తలు
MOST READ
TRENDING