గురువారం 16 జూలై 2020
Sports - Jun 23, 2020 , 17:46:09

టెస్ట్ ఈజ్ బెస్ట్‌: గేల్‌

టెస్ట్ ఈజ్ బెస్ట్‌:  గేల్‌

న్యూఢిల్లీ: క‌్రికెట్‌లో టెస్టు క్రికెట్‌ను మించింది మ‌రొక‌టి లేద‌ని వెస్టిండీస్ విధ్వంస‌క వీరుడు, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్‌గేల్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో బాగా ఆడితే.. ఇక ఎక్క‌డైనా తిరుగుండ‌ద‌ని గేల్ అన్నాడు. మంగ‌ళ‌వారం టీమ్ఇండియా బ్యాట్స్‌మ‌న్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌తో లైవ్ చాట్‌లో మాట్లాడిన గేల్.. త‌న అభిప్రాయాలు వెల్ల‌డించాడు. 

`టెస్టు క్రికెట్ అత్యుత్త‌మ‌మైన‌ది. క్రికెట్‌లో దీన్ని మించిన ఫార్మాట్ మ‌రొక‌టి లేదు. ఆట‌గాడికి అస‌లు సిస‌లు ప‌రీక్ష ఎదుర‌య్యేది ఇక్క‌డే. అంకిత‌భావం, దృఢ సంక‌ల్పం, నైపుణ్యం బ‌య‌ట‌కు రావాలంటే టెస్టులు ఆడాల్సిందే. జీవితానికి సుదీర్ఘ ఫార్మాట్‌కు అవినాభావ సంబంధం ఉంది. టెస్టు క్రికెట్‌లో స‌వాళ్లు అధికం. అలాగే జీవితంలోనూ ఒడిదుడుకులు స‌హ‌జం. వాటిని ఎదుర్కోగ‌లిగే నైపుణ్యం సంప్ర‌దాయ ఫార్మాట్‌తో అల‌వ‌డుతుంది` అని గేల్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ త‌ర‌ఫున 103 టెస్టులాడిన గేల్‌.. 2014 త‌ర్వాత ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు.


logo