గురువారం 09 జూలై 2020
Sports - Jun 24, 2020 , 01:25:55

టెస్టు క్రికెట్‌ అత్యుత్తమం: గేల్‌

టెస్టు క్రికెట్‌ అత్యుత్తమం: గేల్‌

న్యూఢిల్లీ: క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌ కంటే కష్టమైనది మరొకటి లేదని వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ అన్నాడు. సంప్రదాయ ఫార్మాట్‌కు.. జీవితానికి అవినాభావ సంబంధం ఉందని గేల్‌ పేర్కొన్నాడు. విండీస్‌ తరఫున 103 టెస్టులాడిన గేల్‌ ఏడేండ్లుగా సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. మంగళవారం టీమ్‌ఇండియా క్రికెటర్‌ మయాంక్‌తో గేల్‌ మాట్లాడుతూ.. ‘టెస్టు క్రికెట్‌ అన్నింటి కంటే ఉత్తమమైనది. ఐదు రోజుల ఆటలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో సుదీర్ఘ ఫార్మాట్‌తో నేర్చుకోవచ్చు. మన నైపుణ్యం, మానసిక బలం, అంకితభావం ఇవన్నీ టెస్టులతోనే వెలుగులోకి వస్తాయి’ అని అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని అది ఆటతో పాటు జీవితానికి తోడ్పడుతుందని గేల్‌ చెప్పుకొచ్చాడు.


logo