ఆదివారం 05 జూలై 2020
Sports - Jun 01, 2020 , 22:39:03

టెస్టు క్రికెట్‌.. నా ఫేవరెట్‌ ఫార్మాట్‌ : బుమ్రా

టెస్టు క్రికెట్‌.. నా ఫేవరెట్‌ ఫార్మాట్‌ : బుమ్రా

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌ తనకు అత్యంత ఇష్టమైన ఫార్మాట్‌ అని టీమ్‌ఇండియా ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చెప్పాడు. సంప్రదాయ ఫార్మాట్‌ ఆడడాన్ని తాను అధికంగా ప్రేమిస్తానని అన్నాడు. ఐసీసీ పోడ్‌కాస్ట్‌ ద్వారా కామెంటేటర్లు ఇయాన్‌ బిషప్‌, షాన్‌ పొలాక్‌తో బుమ్రా సోమవారం పలు విషయాలను పంచుకున్నాడు.

"నేనైతే టెస్టు క్రికెట్‌ను అధికంగా ప్రేమిస్తా. నా కంటే తక్కువ వయసు ప్లేయర్లను కలిసి మాట్లాడినప్పుడు.. వారు టీ20లు ఆడేందుకే ఎక్కువ ఇష్టమని చెప్పారు. నేను 90వ దశకం పిల్లాడిని. టెస్టు క్రికెట్‌ చాలా చూశా. సంప్రదాయ ఫార్మాట్‌ ఆడాలని ఆడాలని కోరుకున్నా. ప్రస్తుతం ఆడుతున్నా. టెస్టు క్రికెటే నా ఫేవరెట్‌ ఫార్మాట్‌. ఐదు రోజుల ఆట ఆడడాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తా' అని బుమ్రా చెప్పాడు. భారత్‌ తరఫున ఇప్పటి వరకు 14టెస్టులు ఆడిన బుమ్రా 68వికెట్లు తీసుకొని... అనతి కాలంలో స్టార్‌ పేసర్‌గా ఎదిగాడు. 2019లోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ తీసి.. ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. కాగా ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు.  


logo