సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 23:37:30

టెన్నిస్‌ పోటీలు బంద్‌

టెన్నిస్‌ పోటీలు బంద్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కారణంగా అన్ని పురుషుల, మహిళల టెన్నిస్‌ ప్రొఫెషనల్‌ టోర్నీలను జూన్‌ 7వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ఏటీపీ, డబ్ల్యూటీఏ గురువారం ప్రకటించాయి. అలాగే మట్టికోర్టుల్లో ఈ ఏడాది జరిగే పోటీలన్నీ షెడ్యూల్‌ ప్రకారం సాగబోవని తెలిపాయి. ఏప్రిల్‌ నెలాఖరు లేదా మే తొలివారం వరకు పోటీలను రద్దు చేసే యోచనలో ఉన్నామని గత వారం ప్రకటించిన ఏటీపీ, డబ్ల్యూటీఏ ఇప్పుడు ఏకంగా జూన్‌ 7 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 


logo