మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 12:21:54

ఆస్ట్రేలియాలో క్వారెంటైన్‌.. టెన్ష‌న్‌లో టెన్నిస్ ప్లేయ‌ర్లు

ఆస్ట్రేలియాలో క్వారెంటైన్‌.. టెన్ష‌న్‌లో టెన్నిస్ ప్లేయ‌ర్లు

విక్టోరియా:  ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టెన్నిస్ టోర్నీ తీవ్ర వివాదాల‌కు దారి తీస్తున్న‌ది.  మెల్‌బోర్న్‌లో జ‌రిగే మెగా టోర్నీ కోసం వ‌చ్చిన కొంద‌రు ప్లేయ‌ర్లు పాజిటివ్‌గా తేలారు.  ఇద్ద‌రు ఆట‌గాళ్లు పాజిటివ్‌గా తేలిన‌ట్లు విక్టోరియా హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొన్న‌ది. దీంతో టోర్నీతో సంబంధం ఉన్న వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకున్న‌ది. అయితే పాజిటివ్ తేలిన ఆట‌గాళ్లు వ‌చ్చిన విమానాల్లోని ప్ర‌యాణికుల‌కు క‌ఠిన‌మైన లాక్‌డౌన్‌లో ఉంచారు.  ఆ ప్ర‌యాణికుల‌ను క్వారెంటైన్ నుంచి రిలీజ్ చేయలేద‌ని డిక్టోరియా ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.  టెన్నిస్ టోర్నీలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆట‌గాళ్లు అంద‌రూ ప్ర‌స్తుతం హోట‌ల్ రూమ్‌లో క్వారెంటైన్ అయి ఉన్నారు.  ఆంక్ష‌లు క‌ఠినంగా ఉండ‌డంతో ఆట‌గాళ్ల‌లో అస‌హ‌నం పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది.  టాప్ ప్లేయ‌ర్ నోవాక్ జోకోవిచ్‌ కూడా లాక్‌డౌన్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 

కొంద‌రు ఆట‌గాళ్ల‌కు రూల్స్ మార్చాలంటూ జోకోవిచ్ టోర్నీ అధికారుల్ని కోరిన‌ట్లు తెలుస్తోంది.  దీంతో జోకోవిచ్ తీరుపై కూడా కొంద‌రు ఆట‌గాళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  రెండు వారాల పాటు ఆట‌గాళ్లు హోటల్ రూమ్‌లో ఉండాల‌న్న నిబంధన‌పై జోకోవిచ్ అసంతృప్తితో ఉన్నాడు. క్వారెంటైన్ రూల్స్ మార్చాల‌ని జోకోవిచ్ కోర‌డాన్ని ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ నిక్ కిర్గియోస్ త‌ప్పుప‌ట్టాడు. ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ నుంచి ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ జ‌ర‌గాల్సి ఉంది. దాని కోసం సుమారు 1200 మంది ఆస్ట్రేలియాలో బిజీబిజీగా మారారు. మూడు విమానాల్లో కొంద‌రికి పాజిటివ్ తేల‌డంతో.. దాదాపు 72 మంది ఆట‌గాళ్లు 14 రోజుల క్వారెంటైన్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల టోర్నీని వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.

VIDEOS

logo