బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 27, 2020 , 23:18:39

ఖేలోఇండియా టెన్నిస్‌ ఫైనల్లో ఓయూ

ఖేలోఇండియా టెన్నిస్‌ ఫైనల్లో ఓయూ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయ (ఓయూ) విద్యార్థులు  కొండవీటి అనూష, శ్రావ్య శివానీ  సత్తాచాటారు. గురువారం ఢిల్లీ యూనివర్సిటీతో జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో అనూష 2-6, 6-4, 7-6 తేడాతో బనీసింగ్‌(ఢిల్లీ యూనివర్సిటీ)పై విజయం సాధించింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో అనూష అద్భుత పోరాటపటిమ కనబరిచింది. తొలి సెట్‌ను కోల్పోయినా పుంజుకుని పోటీలోకొచ్చిన అనూష వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ మ్యాచ్‌ను తన వశం చేసుకుంది. మరో పోరులో శ్రావ్య శివానీ 6-0, 6-4తో హర్షిత శివ్‌    (ఢిల్లీ యూనివర్సిటీ)పై అలవోక విజయం సాధించింది.  
logo