బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 03, 2020 , 18:14:41

బ్యాట్స్‌మెన్లకు హెల్మెట్ తప్పనిసరి చేయండి : సచిన్‌ టెండూల్కర్‌

బ్యాట్స్‌మెన్లకు హెల్మెట్ తప్పనిసరి చేయండి : సచిన్‌ టెండూల్కర్‌

దుబాయ్‌ : క్రీడాకారుల భద్రత గురించి ఆందోళన చెందుతున్న భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కు కొత్త ప్రపోజ్‌ అందజేశారు. ప్రొఫెషనల్ స్థాయిలో ఆడుతున్నప్పుడు బ్యాట్స్‌మెన్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని సచిన్‌ కోరారు. ఐపీఎల్‌ మ్యాచుల్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డర్ నికోలస్ పూరన్ బంతిని స్ట్రైకర్ చివర విసిరిన సమయంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తలపై తాకింది. ఆ వీడియోను టెండూల్కర్ ఐసీసీకి షేర్ చేశాడు. ఈ వీడియో మొదట అధికారిక వెబ్‌సైట్ ద్వారా పోస్ట్ అయింది. అదృష్టవశాత్తూ ఈ సమయంలో విజయ్‌ శంకర్‌ హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది.

"ఆట వేగంగా మారుతున్నది. అయితే, అది సురక్షితంగా ఉందా? ఇటీవల దుష్ట సంఘటనను చూశాం. ఇది స్పిన్నర్ లేదా పేసర్ అయినా.. హెల్మెట్ ధరించడం ప్రొఫెషనల్ స్థాయిలో బ్యాట్స్‌మెన్‌లకు తప్పనిసరిగా ఉండాలి. దీన్ని ప్రాధాన్యంతో తీసుకోవటానికి ఐసీసీని అభ్యర్థిస్తున్నాను” అని సచిన్‌ టెండూల్కర్ ట్వీట్ చేశారు. సచిన్‌ టెండూల్కర్ తన సూచనను బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతోపాటు అన్ని క్రికెట్ బోర్డులకు ట్యాగ్ చేశారు. 2014 నవంబర్‌లో జరిగిన దేశీయ మ్యాచ్‌లో సీన్ అబోట్ బౌన్సర్‌ను ఢీకొనడంతో ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ విషాదకరమైన మరణం ఆటగాళ్ల భద్రతపై చర్చకు దారితీసింది. బ్యాట్స్‌మెన్ భద్రతను పెంచడానికి హెల్మెట్లను పునఃరూపకల్పన చేయమని తయారీదారులను బలవంతం చేసిన విషయం తెలిసిందే.  మరో ట్వీట్‌లో రవిశాస్తిని ట్యాగ్ చేసిన సచిన్‌.. ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా సునీల్ గవాస్కర్ వేసిన ఫుల్-టాస్ బంతిని టాప్‌ ఎడ్జ్‌ చేసిన మీరు హిట్‌ అయిన సమయాన్ని కూడా ఇది నాకు గుర్తుచేస్తున్నదని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.