గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 09, 2020 , 13:44:18

విరాట్‌, బాబర్‌ల ఆటతీరు చూస్తుంటే టెండూల్కర్‌ గుర్తొస్తున్నాడు : బిషప్‌

విరాట్‌, బాబర్‌ల ఆటతీరు చూస్తుంటే టెండూల్కర్‌ గుర్తొస్తున్నాడు : బిషప్‌

న్యూ ఢిల్లీ : భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజంలు సరళ రేఖల్లో ఆడుతున్న తీరు చూస్తుంటే దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ టెండూల్కర్‌ గుర్తుకొస్తున్నాడని వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్ అన్నారు. "విరాట్ కోహ్లీ, బాబర్ అజం, సరళ రేఖల పరంగా సచిన్‌ను గుర్తు చేస్తున్నారు’’ అని బిషప్ మాజీ జింబాబ్వే పేసర్ పోమ్మీ మబాంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియో చాట్‌లో చెప్పారు.

తాను బౌలింగ్‌ చేస్తున్నప్పుడు సచిన్‌ ఎల్లప్పుడూ సరళ రేఖలో బ్యాటింగ్‌ చేస్తాడని, అప్పుడు అతను అత్యుత్తమంగా ఆడుతున్నట్లు అనిపిస్తుందని, ఇప్పుడు ఈ ఇద్దరు కుర్రాళ్లు (కోహ్లి, ఆజం) ఇదే రీతిలో ఆడుతున్నారని బిషప్‌ అన్నారు. 

గత రెండేళ్లుగా కోహ్లీ, బాబర్‌ ఆజం బ్యాటింగ్‌ తీరును అందరు పోలుస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్‌ జాబితాలో 25 ఏండ్ల బాబర్ మొదటి స్థానంలో ఉండగా కోహ్లి 10వ స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా బాబర్ మూడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ తరువాత రెండో స్థానంలో కోహ్లి ఉండగా, బాబర్‌ ఆరో స్థానంలో ఉన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo