మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 13, 2020 , 18:01:38

వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన సచిన్‌

వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన  సచిన్‌

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అసోంలోని ఛారిటబుల్‌ హాస్పిటల్‌కు వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చారు. సచిన్‌ సాయం ద్వారా 2వేల మంది పిల్లలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్న సచిన్‌..పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో అవసరమైన పరికరాలను కరీమ్‌గంజ్‌ జిల్లాలోని మకుండా ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు.   టెండూల్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా సచిన్‌ మధ్యప్రదేశ్‌లోని గిరిజన వర్గాలకు న్యూట్రిషన్‌ ఆహారం అందించడంతో పాటు విద్యను అందిస్తున్నారు.   కొత్త పరికరాలతో  ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో వచ్చే పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలను అందించడానికి వీలుకలుగుతుంది.