శనివారం 08 ఆగస్టు 2020
Sports - Aug 02, 2020 , 01:51:31

పది పాయింట్ల ఎజెండా ఐపీఎల్‌ జీసీ భేటీ నేడు

పది పాయింట్ల ఎజెండా ఐపీఎల్‌ జీసీ భేటీ నేడు

న్యూఢిల్లీ: పది పాయింట్ల ఎజెండాతో ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌(జీసీ) ఆదివారం సమావేశం కాబోతున్నది. యూఏఈలో లీగ్‌ నిర్వహణపై కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖ అనుమతుల విషయంలో స్థితిగతులు ఎలా ఉన్నాయో బ్రిజేశ్‌ పటేల్‌ నేతృత్వంలోని జీసీ చర్చించనుంది. ఈ ఆన్‌లైన్‌ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా హాజరు కానున్నారు. అనుమతుల అంశంతో పాటు ఐపీఎల్‌ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న  వివోపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు లీగ్‌ షెడ్యూల్‌ ఖరారు, ఎస్‌వోపీ, ప్లేయర్ల రిప్లేస్‌మెంట్‌, అవినీతి నిరోధక యూనిట్‌ కార్యకలాపాలపై చర్చించనున్నారు. 


logo