గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 28, 2020 , 00:10:38

మరో సాహసానికి గోలి శ్యామల

మరో సాహసానికి గోలి శ్యామల

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ స్విమ్మర్‌ గోలి శ్యామల మరో సాహసానికి సిద్ధమైంది. నాలుగు పదుల వయసులో ఇప్పటికే స్వి మ్మింగ్‌లో అనితరసాధ్యమైన ఫీట్లను అం దుకున్న శ్యామల మార్చి 14న ధనుష్‌కోటి(భారత్‌) నుంచి తలైమన్నార్‌(శ్రీలంక) వరకు ఈదబోతున్నది. దీనికి సంబంధించిన వివరాలను ఆమె మీడియాతో పంచుకుంది. తొలి తెలుగు మహిళ ఓపెన్‌ వాటర్‌ స్విమ్మర్‌గా రికార్డులకెక్కిన 47 ఏండ్ల శ్యామల 30 కిలోమీటర్ల దూరం ఈదేందుకు కఠోరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నది. స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో కోచ్‌ ఆయూష్‌ యాదవ్‌ శిక్షణలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నట్లు శ్యామల తెలిపింది. 
logo