ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 10, 2021 , 02:34:06

ప్రణయ్‌ పసిడి మెరుపులు

ప్రణయ్‌ పసిడి మెరుపులు

గువహటి (అసోం): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్‌ కె.ప్రణయ్‌ పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం ఇక్కడ జరిగిన అండర్‌-16 బాలుర హైజంప్‌లో 1.89 మీటర్ల ఎత్తు ఎగిరి దూకిన ప్రణయ్‌ అగ్రస్థానం దక్కించుకున్నాడు. అథర్వ్‌ శ్రీకాంత్‌ (మహారాష్ట్ర, 1.86 మీ.), దృష్టిమన్‌ గోస్వామి (అసోం, 1.86 మీ) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. సోమవారం జరిగిన లాంగ్‌జంప్‌లోనూ ప్రణయ్‌ కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ నాలుగు రోజులు పూర్తికాగా తెలంగాణకు ఇప్పటి వరకు ఆరు పతకాలు దక్కాయి.

VIDEOS

logo