బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 00:03:13

సత్తాచాటిన ప్రియదర్శిని

సత్తాచాటిన ప్రియదర్శిని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి:  కోల్‌కతా వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ లిఫ్టర్‌ ప్రియదర్శిని సత్తాచాటింది. మహిళల 49కిలోల విభాగం స్నాచ్‌లో 70కిలోలు ఎత్తిన ప్రియదర్శిని, క్లీన్‌ అండ్‌ జర్క్‌ విభాగంలో 98కిలోలతో ఆకట్టుకుంది. దీంతో ఓవరాల్‌గా ఇంటర్‌స్టేట్‌ స్వర్ణ పతకంతో పాటు కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. హాకీంపేట తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి అయిన ప్రియదర్శిని ప్రదర్శన పట్ల కోచ్‌ మాణిక్యాల్‌ రావు అభినందనలు తెలిపారు. 


logo