శనివారం 29 ఫిబ్రవరి 2020
మెరిసిన జీవితేశ్‌

మెరిసిన జీవితేశ్‌

Feb 13, 2020 , 23:37:15
PRINT
మెరిసిన జీవితేశ్‌

హైదరాబాద్‌: తెలంగాణ యువ చెస్‌ ఆటగాడు సాయిఅగ్ని జీవితేశ్‌ ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన 40వ జాతీయ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) తరఫున బరిలోకి దిగిన జీవితేశ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకంతో మెరిశాడు. మొత్తం ఆరు గేముల్లో ఐదింటిలో గెలువడం ద్వారా ఏఏఐకి రజతం దక్కడంలో కీలకమయ్యాడు. టీమ్‌ విభాగంలో పీఎస్‌పీబీకి స్వర్ణం, ఆర్‌ఎస్‌పీబీకి కాంస్యం లభించాయి. తెలంగాణ తరఫున ఆడిన ఇరిగేసి అర్జున్‌, భరత్‌కోటి, వినయ్‌ కుమార్‌, రాహుల్‌ శ్రీవాత్సవ్‌, గిరినాథ్‌ ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచారు. 


logo