బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 00:26:34

క్వార్టర్స్‌లో తెలంగాణ

క్వార్టర్స్‌లో తెలంగాణ
  • జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న 81వ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 3-0తో మహారాష్ట్ర-బిపై ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఫిడేల్‌ ఆర్‌ స్నేహిత్‌ 3-0(6-11, 11-2, 12-10, 15-13)తో భవేశ్‌ ఆప్టేపై గెలిచాడు. తొలి గేమ్‌ చేజార్చుకున్నా..హోరాహోరీగా పోరాడి తర్వాతి గేముల్లో పైచేయి సాధించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో అమన్‌ 3-1తో అశ్విన్‌పై, మహమ్మద్‌ అలీ 3-2తో జాష్‌ దాల్విపై గెలిచారు. సుదీర్ఘ కాలం తర్వాత క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన తెలంగాణ జట్టు జాతీయ గేమ్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు మహిళల విభాగంలో తెలంగాణ 1-3తో తమిళనాడు చేతిలో ఓటమిపాలైంది. తొలి క్వార్టర్స్‌లో వరుణి జైస్వాల్‌ 3-0తో షణ్మతి సత్యమూర్తిపై గెలువగా, మోనికా, ప్రణీత ఓటములు ఎదుర్కొన్నారు. 


logo
>>>>>>