శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 23:29:31

తెలంగాణ కాంస్య మెరుపులు

తెలంగాణ  కాంస్య మెరుపులు
  • కొత్త చరిత్ర లిఖించిన రాష్ట్ర జట్టు..
  • జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌, నమస్తే  తెలంగాణ  ఆట  ప్రతినిధి: తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. 81వ జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర పురుషుల జట్టు కాంస్య పతకంతో మెరిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం 1969లో మీర్‌ఖాసిమ్‌ అలీ నేతృత్వంలో టీటీలో మనకు కాంస్య పతకం దక్కింది. సెమీఫైనల్లో తెలంగాణ 0-3తో పెట్రోలియమ్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు(పీఎస్‌పీబీ) చేతిలో ఓటమిపాలైంది. స్టార్‌ ప్యాడ్లర్‌ శరత్‌ కమల్‌ 3-1తో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌పై విజ యం సాధించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో  సాతియాన్‌ 3-0తో అమన్‌పై, దేశాయ్‌ 3-0తో అలీపై అలవోక గెలిచారు. అంతకుముం దు క్వార్టర్స్‌లో తెలంగాణ 3-1తో తమిళనాడుపై విజయం సాధించింది. స్నేహిత్‌ 3-0తో  ప్రభాకరన్‌ను చి త్తుచేయగా, అమన్‌ 3-2తో నిఖిల్‌ సురేశ్‌పై గెలిచాడు. విజేతలకు రాష్ట్ర టీటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యదర్శి ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు అభినందనలు తెలిపారు.  


logo