శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 18, 2020 , 03:03:57

ఖోఖో సెమీస్‌లో తెలంగాణ

ఖోఖో సెమీస్‌లో తెలంగాణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. అండర్‌-17 బాలుర జట్టు ఖోఖో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన క్వార్టర్స్‌లో తెలంగాణ 20-16 తేడాతో విజయం సాధించింది. మరోవైపు అండర్‌-17 బాలికల టెన్నిస్‌లో రాష్ర్టానికి చెందిన సంజన 6-3, 6-1తో పారిసింగ్‌(హర్యానా)పై అలవోక విజయం సాధించింది. అండర్‌-21 బాలికల విభాగంలో సాత్విక 6-0, 6-0తో శృతి(డామన్‌ అండ్‌ డయ్యు)ని చిత్తుగా ఓడించింది. అండర్‌-17 బాలుర సింగిల్స్‌ పోరులో అయూష్‌ 6-4, 5-7, 1-6తో క్రిష్ణ హుడా(హర్యానా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. డబుల్స్‌లో సాయికార్తీక్‌ రెడ్డి, శశాంక్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో కార్తీక్‌, శశాంక్‌ ద్వయం 6-1, 6-7, 10-5తో హర్యానా జోడీ దివేశ్‌ గెహ్లాట్‌, నితిన్‌ సింగ్‌పై విజయం సాధించింది. ఇక రెజ్లింగ్‌లో తెలంగాణకు నిరాశజనక ఫలితాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో తెలంగాణ ప్రస్తుతం 15వ స్థానంలో కొనసాగుతున్నది. 


logo