శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 14, 2020 , 00:28:08

క్రీడాకారులకు పూర్తి సహకారం: మల్లారెడ్డి

 క్రీడాకారులకు పూర్తి సహకారం: మల్లారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. మర్రి లక్ష్మణ్‌ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఎంఎల్‌ఆర్‌ఐటీ)లో అండర్‌-17 క్యాడెట్‌ జాతీయస్థాయి ఫెన్సింగ్‌ టోర్నీని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతీయస్థాయి పోటీలకు ఎంఎల్‌ఆర్‌ఐటీ వేదిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఆర్‌ఐటీ చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, రాష్ట్ర ఫెన్సింగ్‌ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు రంగారావు, కార్యదర్శి ప్రకాశ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo