సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 11, 2021 , 01:07:41

రజత ‘దీప్తి’

రజత ‘దీప్తి’

  • అండర్‌-18లో నందినికి అత్యుత్తమ అథ్లెట్‌ అవార్డు 

గువహటి (అసోం): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్‌ జివాంజి దీప్తి రెండో రజత పతకం సాధించింది. బుధవారం చివరి రోజు పోటీలు జరుగగా.. అండర్‌-18 బాలికల 200 మీటర్ల పరుగులో 24.67 సెకన్లలో గమ్యాన్ని చేరిన దీప్తి రెండో స్థానంలో నిలిచింది. సుదీశన (మహారాష్ట్ర, 24.65) స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే 0.02 సెకన్ల రెప్పపాటు తేడాతో దీప్తికి కాస్తలో పసిడి చేజారింది. కాగా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ అమ్మాయి అగసర నందినికి అండర్‌ - 18 బాలికల విభాగంలో అత్యుత్తమ అథ్లెట్‌ అవార్డు దక్కింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన నందిని చాంపియన్‌షిప్‌ లాంగ్‌జంప్‌, 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మూడు స్వర్ణాలు సహా మొత్తం ఏడు పతకాలు దక్కాయి. కాగా చివరి రోజు బాలుర 200 మీటర్ల పరుగులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షణ్ముగ శ్రీనివాస్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. 21.60 సెకన్లలో అతడు గమ్యాన్ని చేరాడు. VIDEOS

logo