ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 28, 2020 , 14:30:42

కోహ్లీసేన వినూత్నంగా ట్రైనింగ్‌ డ్రిల్‌..

కోహ్లీసేన వినూత్నంగా  ట్రైనింగ్‌ డ్రిల్‌..

ఐదు టీ20ల సిరీస్‌లో కీలకమైన మూడో టీ20 బుధవారం జరగనుంది.

 హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా ఆక్లాండ్‌ నుంచి మ్యాచ్‌ వేదిక హామిల్టన్‌కు వెళ్లింది. ఐదు టీ20ల సిరీస్‌లో కీలకమైన మూడో టీ20 బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సాధన చేశారు. ఆటగాళ్లు కొత్త ట్రైనింగ్‌ డ్రిల్‌లో పాల్గొన్నారు.  రెగ్యులర్‌గా  కాకుండా ఈసారి వినూత్నంగా  క్యాచ్‌లు అందుకోవడాన్ని ప్రాక్టీస్‌ చేశారు.  క్యాచ్‌లు చేజారితే మ్యాచ్‌ ఫలితాలే మారే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదులుతూ క్యాచ్‌లు ఒడిసిపట్టేలా  ఫీల్డింగ్‌ కోచ్‌ సాధన చేయించారు. తొలి రెండు టీ20ల్లో కివీస్‌ను చిత్తుచేసిన భారత్‌ అదే ఊపులో మూడో టీ20 గెలిచి 3-0తో సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వరుస విజయాలతో టీమ్‌ఇండియా ఉత్సాహంతో ఉండగా.. సొంతగడ్డపై ఘోర ఓటములతో కివీస్‌పై ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో పటిష్ఠంగా ఉన్న కోహ్లీసేనకు కివీస్‌ ఏ మేరకుపోటీనిస్తుందో చూడాలి. logo