మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 25, 2020 , 21:39:48

లాక్‌డౌన్‌లోనూ భారత క్రికెటర్ల కసరత్తు

లాక్‌డౌన్‌లోనూ భారత క్రికెటర్ల కసరత్తు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో ఏర్పడ్డ లాక్‌డౌన్‌ పరిస్థితులను టీమ్‌ఇండియా క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. స్వీయ నిర్బంధంలోనూ తమ ఫిట్‌నెస్‌ కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న వనరులతో ఇంట్లోనే కసరత్తు చేస్తున్నారు. జట్టు స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ నిక్‌వెబ్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌ సూచనలకు అనుగుణంగా క్రికెటర్లు సాధన చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. క్రికెటర్ల శరీరాకృతిని బట్టి వేర్వేరుగా వర్క్‌ఔట్లు సిద్ధం చేశారు. 

‘ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అందరు ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లో భాగమవుతున్నారు. ఇంట్లో ఎలాంటి కసరత్తులు చేస్తున్నారో ఎప్పటికప్పుడు నిక్‌ వెబ్‌తో పాటు నితిన్‌ పటేల్‌కు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఫిట్‌నెస్‌ కార్యక్రమంలో భాగంగా బ్యాట్స్‌మెన్‌, బౌలర్ల వేర్వేరుగా రూపొందించారు. 

ఉదాహరణకు  బౌలర్లకు లోయర్‌బాడీ ఎక్సర్‌సైజులకు ప్రాధాన్యమిచ్చేలా, బ్యాట్స్‌మెన్‌ విషయానికొస్తే..భుజాలు, మణికట్టు మరింత బలంగా ఉండేలా ఫిట్‌నెస్‌ ప్రణాళిక తయారుచేశాం’ అని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్‌ అంతకంతకు విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా 21 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.                      logo
>>>>>>