టోక్యో : శుక్రవారం మొదలుకానున్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో అమెరికా పతాకదారుల కోసం రాల్ఫ్ లారెన్ సంస్థ ప్రత్యేక కూలింగ్ జాకెట్లను తయారుచేసింది. వైట్ కలర్‌తో ఉండే ఈ జాకెట్లను ‘ఆర్ఎల్ కూలింగ్ జాకెట్’ పేరుతో ఆ సంస్థ వైస్ చైర్మెన్ డేవిడ్ లారెన్ ఇటీవలే విడుదల చేశారు. తేలికపాటి బరువుండే ఈ జాకెట్లు.. ఆటగాళ్లకు చల్లదనాన్ని అందజేస్తాయి. కాలర్ దగ్గర ఫ్యాన్‌తో ఉండే ఈ దుస్తులలో బ్యాటరీ కంట్రోలర్ కూడా ఉంది.