అబిడ్స్, మే 24 : కరోనా బారినపడి హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి వైద్య సలహాలతో పాటు ఉచితంగా ఐసొలేషన్ కిట్టు అందజేస్తున్నట్లు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ డాక్టర్ మామిడి భీంరెడ్డి తెలిపారు. సోమవారం రెడ్‌క్రాస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన మల్లయ్య, చంద్రకళ, సత్యరోహన్ల ఇంటికి వెళ్లి ఐసొలేషన్ కిట్లను అందజేసినట్లు చెప్పారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు 040-40527746ను సంప్రదించాలన్నారు. మంగళవారం నుంచి హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు వినయ్కిశోర్, కార్యదర్శి పార్వతి, కొవిడ్ కన్వీనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.