శనివారం 16 జనవరి 2021
Sports - Nov 24, 2020 , 17:13:59

ఆస్ట్రేలియాతో వ‌న్డేల‌కు 1992 వ‌ర‌ల్డ్‌క‌ప్ జెర్సీలు

ఆస్ట్రేలియాతో వ‌న్డేల‌కు 1992 వ‌ర‌ల్డ్‌క‌ప్ జెర్సీలు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌లో టీమిండియా మ‌రోసారి ఆ పాత రోజుల‌ను గుర్తు చేయ‌నుంది. 1992లో ఇదే ఆసీస్ గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అప్ప‌టి టీమిండియా వేసుకున్న జెర్సీల‌తోనే ఇప్ప‌టి టీమ్ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ విష‌యాన్ని ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ట్విట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశాడు. ఆ జెర్సీ వేసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. కొత్త జెర్సీతో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామ‌ని ధావ‌న్ ట్వీట్ చేశాడు. నేవీ బ్లూ క‌ల‌ర్‌లోని ఈ జెర్సీ భుజాల‌పై రంగుల చార‌లు ఉన్నాయి. నిజానికి ఇలా రెట్రో జెర్సీల‌ను ధ‌రించ‌డం ఆస్ట్రేలియానే 2018-19 సిరీస్‌లో మొద‌లుపెట్టింది. అప్ప‌ట్లో 1985 వ‌ర‌ల్డ్ సిరీస్ జెర్సీల‌ను ఆసీస్ ప్లేయ‌ర్స్ వేసుకున్నారు. ఈ ఏడాది మొద‌ట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ రెండూ 1999 వ‌రల్డ్‌క‌ప్ జెర్సీల‌లో క‌నిపించాయి. ఈ నెల 27న మొద‌ల‌య్యే వ‌న్డే సిరీస్‌తో ఆస్ట్రేలియాలో టీమిండియా టూర్ ప్రారంభ‌మ‌వుతుంది. మూడు వ‌న్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జ‌ర‌గ‌నున్నాయి. సుమారు 9 నెల‌ల త‌ర్వాత ఇండియ‌న్ టీమ్ వ‌న్డే సిరీస్ ఆడుతోంది. త‌న చివ‌రి సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 2-1తో విజ‌యం సాధించింది.