గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 28, 2021 , 11:31:53

వింత షెడ్యూల్‌.. ఇంగ్లండ్‌లో టీమిండియాతో ఇండియా 'ఎ' ఢీ

వింత షెడ్యూల్‌.. ఇంగ్లండ్‌లో టీమిండియాతో ఇండియా 'ఎ' ఢీ

ముంబై: ఇండియ‌న్ నేష‌న‌ల్ టీమ్‌, ఇండియా ఎ టీమ్ వెళ్లి మ‌రో దేశంలో ఓ వామ‌ప్ మ్యాచ్ ఆడ‌టం ఎప్పుడైనా చూశారా?  కానీ వ‌చ్చే జులైలో ఇంగ్లండ్‌లో ఈ వింత చూడ‌బోతున్నారు. ఆగ‌స్ట్‌, సెప్టెంబ‌ర్‌ల‌లో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడ‌టానికి వెళ్తున్న టీమిండియా.. త‌మ వామ‌ప్ మ్యాచ్‌ల ప్ర‌త్య‌ర్థిగా ఇండియా ఎ టీమ్‌ను ఎంచుకుంది. ఈ రెండు టీమ్స్ మ‌ధ్య రెండు నాలుగు రోజుల వామ‌ప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. జులై 21న నార్తాంప్ట‌న్‌షైర్‌లో, జులై 28న లీసెస్ట‌ర్‌షైర్‌లో ఈ రెండు వామ‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. ఆ త‌ర్వాత ఆగ‌స్ట్ 4 నుంచి తొలి టెస్ట్ ప్రారంభ‌మ‌వుతుంది. టీమిండియా, ఇండియా ఎ టీమ్స్ మ్యాచ్‌ల కోసం మార్చిలో టికెట్లు అమ్మ‌నున్నారు. క్రికెట్ అభిమానుల‌కు ఇదొక అరుదైన అవ‌కాశమ‌ని, టికెట్ల‌కు డిమాండ్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంద‌ని తాము అంచ‌నా వేస్తున్న‌ట్లు లీసెస్ట‌ర్‌షైర్ చెయిర్ మెహ‌మూదా డ్యూక్ చెప్పారు. 

ఇండియా 'ఎ'ని ఎందుకు ఎంచుకుంది?

టీమిండియా ఇలా త‌న వామ‌ప్ ప్ర‌త్యర్థిగా ఓ కౌంటీ టీమ్‌ను కాకుండా ఇండియా ఎ టీమ్‌ను ఎంచుకోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. 2019 యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా కూడా ఇలాగే చేసింది. టూర్ మ్యాచ్‌ల‌కు క్ర‌మంగా క్రేజ్ త‌గ్గిపోతుండ‌టంతో టీమ్స్ ఇలా చేస్తుండ‌టం విశేషం. గ‌తంలో బ‌ల‌మైన కౌంటీ టీమ్స్‌తో వామ‌ప్ మ్యాచ్‌లు జ‌రిగేవి. ఈ మ్యాచ్‌ల‌కు అభిమానుల నుంచి మంచి స్పంద‌న కూడా వ‌చ్చేది. అయితే ఆ త‌ర్వాత బ‌ల‌హీన కౌంటీ టీమ్స్‌తో ఈ మ్యాచ్‌ల‌కు క్రేజ్ త‌గ్గిపోయింది. దీంతో ఇలా త‌మ ఎ టీమ్స్‌తోనే వామ‌ప్ మ్యాచ్‌లు ఆడాల‌ని ఇంగ్లండ్ టూర్‌కు వ‌స్తున్న టీమ్స్ నిర్ణ‌యిస్తున్నాయి. 

ఇంగ్లండ్‌లో టీమిండియా షెడ్యూల్‌

తొలి టెస్ట్‌: ఆగ‌స్ట్ 4-8 నాటింగ్‌హామ్‌లో

రెండో టెస్ట్‌: ఆగ‌స్ట్ 12-16, లండ‌న్‌లో

మూడో టెస్ట్‌: ఆగ‌స్ట్ 25-29, లీడ్స్‌లో

నాలుగో టెస్ట్‌:  సెప్టెంబ‌ర్ 2-6, లండ‌న్‌లో

ఐదో టెస్ట్‌:  సెప్టెంబ‌ర్ 10-14, మాంచెస్ట‌ర్‌లో


ఇవి కూడా చ‌ద‌వండి

పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో హైద‌రాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?

ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించండి..

ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు


VIDEOS

logo