గురువారం 04 మార్చి 2021
Sports - Jan 26, 2021 , 15:38:26

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో టీమిండియా

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో టీమిండియా

ముంబై: స‌్పిన్‌తో ఇంగ్లండ్‌ను చుట్టేయ‌డానికి సిద్ధ‌మవుతోంది టీమిండియా. చివ‌రిసారి 2016లో ఇంగ్లండ్ ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఆ సిరీస్‌లో 93 వికెట్లు ప‌డితే అందులో ఈ ఇద్ద‌రే క‌లిసి 54 వికెట్లు తీసుకోవ‌డం విశేషం. దీంతో ఈసారి కూడా స్పిన్ అస్త్రాన్నే ప్ర‌యోగించాల‌ని కోహ్లి సేన భావిస్తోంది. అయితే ఈ సారి జ‌డేజా లేక‌పోవ‌డంతో ఆ భారాన్ని కుల్‌దీప్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లాంటి యువ స్పిన్న‌ర్లు మోయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే తొలి రెండు టెస్టుల‌కు న‌లుగురు స్పిన్న‌ర్ల‌ను ఎంపిక చేశారు. 

ఇద్ద‌రు పేస‌ర్లు, ముగ్గురు స్పిన్న‌ర్లు

తొలి టెస్ట్‌కు ఐదుగురు స్పెషలిస్ట్ బౌల‌ర్ల‌తో బ‌రిలోకి దిగాల‌ని విరాట్ కోహ్లి భావిస్తున్నాడు. ఆ లెక్క‌న ఇద్ద‌రు పేస‌ర్లు, ముగ్గురు స్పిన్న‌ర్ల‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌నుంది. అశ్విన్‌తోపాటు కుల్‌దీప్ యాద‌వ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఈ మ్యాచ్‌లో ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. బ్రిస్బేన్ టెస్ట్‌లో సుంద‌ర్ ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. దీంతో ఈ ముగ్గురి కాంబినేష‌న్ ఇంగ్లండ్‌కు చిక్కులు తెచ్చిపెట్ట‌డం ఖాయ‌మ‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 

VIDEOS

logo