ముగిసిన రెండోరోజు ఆట..భారీ ఆధిక్యంలో భారత్

చెన్నై: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు ఆటలోనూ టీమ్ఇండియా అదరగొట్టింది. ఆతిథ్య బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. అదే పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు రాణించగా ప్రత్యర్థి జట్టు మాత్రం రెండు విభాగాల్లోనూ తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లకు ధాటికి ఇంగ్లాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండోరోజు, ఆదివారం ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(25), పుజారా(7) క్రీజులో ఉన్నారు. యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్(14) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ప్రస్తుతం మ్యాచ్‌పై పట్టుసాధించిన కోహ్లీసేన 249 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఓవర్‌నైట్ స్కోరు 300/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 329 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్(58 నాటౌట్) అర్ధసెంచరీతో మెరిశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఆది నుంచే తడబడింది. ఆతిథ్య టీమ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లీష్ జట్టును 150 పరుగుల లోపే చుట్టేసింది. భారత స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడిన ఇంగ్లీష్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/43) తన మాయాజాలాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇషాంత్ శర్మ(2/22), అక్షర్ పటేల్(2/40) కట్టుదిట్టంగా బంతులేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. బెన్‌ఫోక్స్(42 నాటౌట్: 107 బంతుల్లో 4ఫోర్లు) టాప్ స్కోరర్. రోరీ బర్న్స్(0), డొమినిక్ సిబ్లే(16), డేనియల్ లారెన్స్(9), జో రూట్(6), బెన్ స్టోక్స్(18), ఓలీ పోప్(22), మొయిన్ అలీ(6) ఆతిథ్య బౌలర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
That's Stumps on Day 2 of the second @Paytm #INDvENG Test at Chepauk! #TeamIndia 54/1 & extend their lead to 249 against England. ????????@ImRo45 2⃣5⃣*@cheteshwar1 7⃣*
— BCCI (@BCCI) February 14, 2021
Scorecard ???? https://t.co/Hr7Zk2kjNC pic.twitter.com/ndJlA9AxMQ
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం