ప్రాక్టీస్ ప్రారంభం

- చెన్నైలో టీమ్ఇండియా సాధన షురూ
చెన్నై: ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా సన్నాహకాలను ప్రారంభించింది. ఈ నెల 5 నుంచి తొలి టెస్టు జరుగనున్న ఇక్కడి చెపాక్ స్టేడియంలో కోహ్లీసేన నెట్ ప్రాక్టీస్ షురూ చేసింది. ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో సోమవారమే ఔట్‌డోర్ సెషన్‌కు దిగిన భారత ఆటగాళ్లు.. మంగళవారం తొలి నెట్ సెషన్లో చెమటోడ్చారు. ముందుగా హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్లేయర్లందరికి దిశానిర్దేశం చేశాడు. కసరత్తుల అనంతరం ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆడారు. ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలుపు తర్వాత ఆడనున్న సిరీస్ కావడం, టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కీలకమవడంతో సొంతగడ్డపై ఇంగ్లిష్ జట్టును చిత్తుచేయాలని టీమ్ఇండియా పట్టుదలగా ఉంది.
పాండ్య ఆలస్యంగా..
వ్యక్తిగత కారణాల వల్ల క్వారంటైన్లోకి ఓ రోజు ఆలస్యంగా వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బుధవారం జట్టుతో కలువనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి వచ్చిన అతడు బౌలింగ్‌లోనూ పాలుపంచుకొని.. తుది జట్టులోని ఇద్దరు పేసర్లపై పడే భారాన్ని తగ్గించాలని టీమ్ఇండియా మేనేజ్మెంట్ భావిస్తున్నది. అయితే 2019లో వెన్ను సర్జరీ చేయించుకున్న పాండ్య మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడో లేదో చూడాలి.
ఇషాంత్ వచ్చేశాడు
గాయం కారణంగా ఆసీస్ టూర్‌కు పూర్తిగా దూరమైన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గొనడం టీమ్ఇండియాకు ఊరట కలిగించే అంశం. పితృత్వ సెలవులతో ఆసీస్‌పై చివరి మూడు టెస్టుల నుంచి వైదొలిగిన కెప్టెన్ కోహ్లీ.. తండ్రి అయ్యాక తొలిసారి ప్రాక్టీస్‌లో అడుగుపెట్టాడు. గాయాల వల్లే బ్రిస్బేన్ టెస్టు ఆడలేపోయిన స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా పూర్తి ఫిట్నెస్తో కనిపించారు.
తాజావార్తలు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత