న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పతకం నెగ్గడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్న భారత స్టార్ షూటర్ మను భాకర్.. ఓ వైపు తన గురికి పదును పెడుతూనే.. ఖాళీ సమయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నది. యూరోపియన్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు ప్రస్తుతం క్రొయేషియా వెళ్లిన మను.. హోటల్ గదిలో తన బీఏ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్ మహిళా కళాశాలలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న మను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో పరీక్షలు రాయనుంది. యూరోపియన్ చాంపియన్షిప్ 20న ప్రారంభం కానుండటంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని భాకర్ చెప్పింది. ‘గతంలోలానే పరీక్షలు, షూటింగ్.. రెండింటిని పూర్తి చేస్తాను. పరీక్ష ఉన్న రోజు పోటీలు లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశం గర్వపడేలా చేయడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం’ అని మను పేర్కొంది.