గురువారం 21 జనవరి 2021
Sports - Dec 22, 2020 , 23:06:36

పెళ్లిచేసుకున్న టీమిండియా స్పిన్నర్‌ చాహల్‌

పెళ్లిచేసుకున్న టీమిండియా స్పిన్నర్‌ చాహల్‌

హైదరాబాద్ : టీమిండియా లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్ చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో ధన్యశ్రీ వర్మతో నిశ్చితార్థం చేసుకున్న చాహల్ ఆమెని పెళ్లి చేసుకున్నట్లు మంగళవారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. నిశ్చితార్థం అనంతరం ఐపీఎల్ -2020 సీజన్‌లో ఆడేందుకు చాహల్‌ యూఏఈకి వెళ్లాడు. ధనుశ్రీ కూడా టోర్నీ మధ్యలో యూఏఈకి వెళ్లడంతో పెళ్లికి ముందు ఇద్దరు కలిసి తిరిగేందుకు అవకాశం దక్కింది. అట్నుంచి ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడేందుకు వెళ్లి చాహల్‌ ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చాడు. 

ఇక ముంబయిలో జన్మించిన ధన్యశ్రీ వర్మ మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అంతేకాకుండా తాను ఓ యూట్యూబ్ ఛానల్‌ని సైతం నడుపుతోంది. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపార వేత్త. తల్లి వర్ష డెంటిస్ట్‌. దీంతో తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధన్యశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధన్యశ్రీకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. చాహాల్‌, ధన్యశ్రీ వివాహా ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo