సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 23, 2021 , 11:33:29

పింక్ బాల్‌తో టీమిండియా ప్రాక్టీస్‌

పింక్ బాల్‌తో టీమిండియా ప్రాక్టీస్‌

అహ్మ‌దాబాద్‌: ఇంగ్లండ్‌తో బుధ‌వారం నుంచి ప్రారంభం కాబోతున్న డేనైట్ టెస్ట్ కోసం టీమిండియా నెట్స్‌లో శ్ర‌మిస్తోంది. ఫ్ల‌డ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో ప్లేయ‌ర్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోల‌ను బీసీసీఐ ట్విట‌ర్‌లో షేర్ చేసింది. మొతెరాలో జ‌ర‌గ‌నున్న పింక్ బాల్ టెస్ట్ కోసం టీమిండియా సిద్ధ‌మ‌వుతోందంటూ బోర్డు కామెంట్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా.. పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్ చేస్తూ క‌నిపించాడు. ఇండియాలో జ‌ర‌గ‌బోతున్న రెండో పింక్ బాల్ టెస్ట్ ఇది. టీమిండియా ఆడ‌బోతున్న మూడో డేనైట్ టెస్ట్‌. 

ఇండియాలో తొలిసారి ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి డేనైట్ టెస్ట్ ఆడింది. 2019లో ఈ మ్యాచ్ జ‌ర‌గ్గా.. మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన మొతెరా మ‌రో పింక్ బాల్ టెస్ట్‌కు ఆతిథ్య‌మిస్తోంది. పైగా మొతెరాను రెనోవేట్ చేసిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ కూడా ఇదే. ప్ర‌స్తుతం నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇండియా, ఇంగ్లండ్ 1-1తో స‌మంగా ఉన్నాయి. 

VIDEOS

logo