రేపటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు

చెన్నై: ఏడాది విరామం తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు ముమ్మర సాధన చేస్తున్నది. శుక్రవారం నుంచి చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు ప్రారంభం కానుండగా.. బుధవారం ఇరుజట్లు మైదానంలో చెమటోడ్చాయి. విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. ఇషాంత్, మహమ్మద్ సిరాజ్, బుమ్రా బౌలింగ్ సాధన చేశారు. అనంతరం జట్టు సభ్యులంతా కలిసి ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. వెన్నెముకకు శస్త్రచికిత్స అనంతరం తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాం డ్యా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మరోవైపు ఇం గ్లండ్ తరఫున వందో టెస్టు ఆడనున్న కెప్టెన్ జో రూట్.. శ్రీలంక పి చ్‌లపై కనబరిచిన ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు చెన్నైలో జరుగనుండగా.. రెండో టెస్టు నుంచి మైదానంలోకి అభిమానులను అనుమతించనున్న విషయం తెలిసిందే.
కోహ్లీకి సహాయపడటమే నా బాధ్యత
ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి రావడంతోనే తాను జట్టును నడిపించానని అజింక్యా రహానే పేర్కొన్నాడు. ‘వెనుక సీట్లో కూర్చొని విరాట్ కోహ్లీకి సహాయపడటమే ఇప్పుడు నా బాధ్యత. నిజంగా ఇది చాలా సులువు. అతడు ఏ విషయంలోనైనా నన్ను సలహా అడిగితే.. నా అభిప్రాయం చెబుతా. ఆసీస్ పర్యటన ముగిసింది. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌పైనే మా దృష్టి. లంకలో సిరీస్ నెగ్గి వచ్చిన ఇంగ్లండ్‌పై గెలువడం అంత సులువు కాదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదు. ఫైనల్ చేరే అర్హత న్యూజిలాండ్‌కు ఉంది’ అని జింక్స్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ జట్టులో ఒలీ పోప్
టీమ్ఇండియాతో తొలి టెస్టు ఆరంభానికి రెండు రోజుల ముందు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఒలీ పోప్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జట్టులో చేర్చింది. గతేడాది ఆగస్టులో పాకిస్థాన్‌తో సిరీస్ సందర్భంగా భుజం గాయానికి గురైన 23 ఏండ్ల పోప్.. పూర్తిగా కోలుకున్నాడని ఈసీబీ పేర్కొంది. తొలి టెస్టు తుది జట్టులో పోప్‌కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
- ఎన్ఎస్ఈలో లోపం ఊహించలేదు.. బట్ భారీ మూల్యం చెల్లించాం!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!