గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 12, 2020 , 18:02:11

ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన

ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటన కోసం   విరాట్‌ కోహ్లీ  సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు   గురువారం కంగారూల గడ్డపై  అడుగుపెట్టింది. దుబాయ్‌ నుంచి బయలుదేరిన   టీమ్‌ ఇండియా ప్లేయర్లు, సహాయక సిబ్బంది   సుమారు 20 గంటలు ప్రయాణించి  సిడ్నీ చేరుకుంది.    సిడ్నీలోనే     క్వారంటైన్‌లో ఉంటూ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేయనున్నారు.   

కరోనా కారణంగా  భారత బృందం సభ్యులు  పీపీఈ కిట్లు ధరించి ఫేస్‌ మాస్క్‌లు పెట్టుకొన్నారు. సిడ్నీ ఎయిర్‌పోర్టులో కోహ్లీసేన దిగిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్‌ చేసింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో   భారత జట్టు    మూడు వన్డేలు, మూడు టీ20లు,  నాలుగు టెస్టులు ఆడనుంది. వన్డే సిరీస్‌ నవంబర్‌ 27 నుంచి ఆరంభం కానుండగా తొలి టెస్టు (డే/నైట్‌) వచ్చే నెల 17న అడిలైడ్‌లో మొదలవనుంది.